భారతదేశం, ఆగస్టు 13 -- భారత మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే లక్ష్యంతో సిట్రోయెన్ సంస్థ సీ3ఎక్స్ అనే కొత్త కారును విడుదల చేసింది. ఇది సీ3 మోడల్‌కు అప్‌డేటెడ్, ఎస్‌యూవీ తరహా వేరియంట్. ఈ రెండు కార్ల డిజైన్ దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ, సీ3ఎక్స్​లో అధునాతన ఫీచర్లు, మెరుగైన భద్రతా ప్రమాణాలు ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలోనే ఎక్కువ సౌకర్యాలను, భద్రతను కోరుకునే వినియోగదారులను ఇది ఆకట్టుకునేలా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని పోల్చి, ఏది కొనొచ్చు? అన్న విషయాన్ని తెలుసుకుందాము..

సీ3ఎక్స్ ధర: బేస్ వేరియంట్ షైన్ ఎన్ఏ ధర రూ. 7.91 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై, టాప్-స్పెక్ షైన్ టర్బో ఏటీ ధర రూ. 9.89 లక్షల వరకు ఉంటుంది.

సీ3 ధర: కొత్తగా అప్‌డేట్ చేసిన సీ3 ధర ఇప్పుడు రూ. 5.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఇంతకుముందు సీ3 ధర రూ....