భారతదేశం, జూన్ 3 -- నగరాల్లో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్​ సమస్యలతో వాహనాలు సరైన మైలేజ్​ ఇవ్వడం లేదు. ఫలితంగా పెట్రోల్​ ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్​ 2 వీలర్లవైపు అడుగులు వేస్తున్నారు. మరి మీరు కూడా ఒక మంచి ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! సిటీ డ్రైవ్​ కోసం మార్కెట్​లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్​​ ఈ-స్కూటర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి. రేంజ్​ ఎక్కువ ఉండటం వీటి ప్రత్యేకత!

బిగాస్​ సీ12ఐ- ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 2 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే దాదాపు 125 కి.మీ రేంజ్​ని ఇస్తుంది. ఈ ఈ-స్కూటర్​ టాప్​ స్పీడ్​ 60కేఎంపీహెచ్​. బ్యాటరీపై 36వేల కి.మీలు లేదా 3ఏళ్ల వారెంటీ లభిస్తోంది. ఈ బ్యాటరీని 0-80శాతం​ ఛార్జ్​ చేసేందుకు కనీసం 3...