భారతదేశం, డిసెంబర్ 23 -- బెంగళూరు లాంటి మెట్రో నగరంలో సొంతిల్లు అనేది ఒక భావోద్వేగంతో కూడిన నిర్ణయం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అది కేవలం ఇష్టం మాత్రమే కాదు, ఒక పెద్ద సవాలుగా మారింది. ఐటీ హబ్‌లకు దగ్గరగా ఉండే ఫ్లాట్ కొనాలా? లేక కాస్త దూరమైనా ప్రశాంతంగా ఉండే శివార్లలో విల్లా తీసుకోవాలా? అనే అంశంపై ఇప్పుడు బెంగళూరు వాసుల్లో పెద్ద చర్చ నడుస్తోంది. తాజాగా రెడిట (Reddit) వేదికగా ఐటీ ఉద్యోగులు పంచుకున్న అనుభవాలు ఈ అయోమయాన్ని కళ్లకు కడుతున్నాయి.

మారతహళ్లిలో ఉంటున్న ఒక ఉద్యోగి తన గోడు వెళ్లబోసుకుంటూ.. "15 ఏళ్ల పాత ఫ్లాట్‌ను భారీ ధర చెల్లించి కొన్నాను. తీరా చూస్తే ఆఫీస్ ఎయిర్‌పోర్ట్ వైపు మారిపోయింది. వారానికి నాలుగు రోజులు ఆఫీస్‌కు రావాలంటున్నారు. ఇప్పుడు ఆ ప్రయాణం నరకంలా అనిపిస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, 2018లో బెల్లందూరులో ఫ్...