భారతదేశం, డిసెంబర్ 28 -- ఈ ఏడాది జూన్‌లో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్‌లో జరిగిన పేలుడు ఘటనలో 54 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను అరెస్టు చేసినట్లు పోలీసులు డిసెంబర్ 28 ఆదివారం తెలిపారు. ప్రమాదంపై నమోదైన కేసులో 2వ నిందితుడిగా సిన్హా ఉన్నారు. శనివారం రాత్రే అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

రిటైర్డ్ శాస్త్రవేత్తల బృందం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తూ.. తెలంగాణ హైకోర్టు సిగాచీ యాజమాన్యంపై తక్షణ చర్య తీసుకోవాలని ఆదేశించింది. జూన్ 30న సంగారెడ్డిలో జరిగిన పేలుడు ప్రమాదంలో 54 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారని, దీనిని తెలంగాణలో జరిగిన అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటనగా కోర్టు అభివర్ణించింది.

ఆరుగ...