Telangana,sangareddy, జూలై 5 -- సంగారెడ్డి జిల్లాలోని సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా కర్మాగారంలో పేలుడు ఘటన తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందటంతో.. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 40కి చేరింది.

జూన్ 30న సిగాచీ కంపెనీలో పేలుడు జరిగింది. ఇందులో 70 శాతానికి పైగా కాలిన గాయాలపాలైన ఉత్తరప్రదేశ్ కు చెందిన 48 ఏళ్ల మున్మున్ చౌదరి ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

శనివారం ఉదయం వరకు 19 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బడుగు తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో గల్లంతైన తొమ్మిది మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

ప్రమాదం జరిగి ఆరు రోజులైనా ఇంకా...