Telangana,hyderabad, అక్టోబర్ 4 -- సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ సైకిల్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో. ఇతర దుకాణాలకు వ్యాపించింది. దీంతో అగ్నిప్రమాద తీవ్రత పెరిగింది. ఈ అగ్ని ప్రమాద ఘటనలో పలు దుకాణాలు దగ్ధమయ్యాయి.

పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి మూడు అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక అధికారి ఒకరు మాట్లాడుతూ."మాకు ఉదయం 11:25 గంటల సమయంలో కాల్ వచ్చింది. మూడు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.ఆస్తి నష్టం జరగగా.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు" అని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ సంఘటనలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు హైదరాబాద్ లోని బేగం బజార్ లోని కనిష్క ఫ...