భారతదేశం, ఏప్రిల్ 30 -- సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు క్యూ లైన్ లలో వేచి ఉన్న భక్తులపై గోడ కూలిన దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

సింహాచలం ఆలయ ఘటనా స్థలంలో ఏడుగురు చనిపోగా ఆస్పత్రిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల వద్ద గల ఆధార్ కార్డులు, కుటుంబ సభ్యుల సహాయంతో వారి వివరాలను అధికారులు వెల్లడించారు.

ప్రమాదంలో మృతి చెందిన వారిలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అడవివరం ప్రాంతానికి చెందిన ఎడ్ల వెంకట్రావు (48), తూర్పుగోదావరి జిల్లా మాచవరం, అంబాజి పేటకు చెందిన ఇంటిరియర్ డిజైనర్‌ పత్తి దుర్గా స్వామీ నాయుడు (32), కుమ్మపట్ల మణికంఠ ఈశ్వరరావు (28), హెచ్ బీ కాలనీ వేంకోజిపాలెం నివాసి గుజ్జరి మహాలక్ష్మి (65), హెచ్ బి కాలనీ ఉమా నగర్ ప్రాంతానికి చెందిన పైలా వెంకట రత్నం (45), మధురవాడ చంద్రపాలెం నివాసి పిల్లా మహేష్(30...