భారతదేశం, ఏప్రిల్ 30 -- సింహాచలంలో గోడ కూలి మరణించిన వారి కుటుంబ సభ్యులను మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. చందనోత్సవం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున స్వామి వారిని దర్శించుకునేందుకు రూ.300 టికెట్‌ కొనుక్కుని క్యూలో నిల్చున్న వారిపై గోడ కూలడంతో ఏడుగురు మరణించారు. ఈ ఘటనలో దంపతులతో సహా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.

తాడేపల్లి నుంచి విశాఖ వచ్చిన వైఎస్ జగన్...నేరుగా చంద్రంపాలెం చేరుకుని, అక్కడ ఉమామహేష్, శైలజ భౌతికకాయాలకు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అక్కడే జగన్‌ మీడియాతో మాట్లాడారు.

"సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం వచ్చినవారు ఇలా చనిపోవడం దురదృష్టకరం. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చనిప...