భారతదేశం, ఏప్రిల్ 30 -- సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగిన ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం తెల్ల వారుజామును రిటైనింగ్‌ వాల్‌ కూలి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం సీఎం మంత్రులు, అధికారులతో చర్చించారు.

ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులు, మంత్రులు ఆనం, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపి భరత్, సింహాచలం దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు పాల్గొన్నారు.

ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు తెలుసుకున్న సిఎం మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల...