భారతదేశం, ఏప్రిల్ 30 -- సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర ప్రమాదం జరిగింది. స్వామి వారి నిజరూపాన్ని దర్శంచుకునేందుకు వచ్చిన భక్తులపై రిటైనింగ్‌ వాల్‌ కూలడంతో 9మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది.

సింహాచలంలో సింహగిరి బస్టాండ్‌ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్‌ వద్ద రూ.300 టిక్కెట్ క్యూలైన్‌పై ఆలయ రిటైనింగ్‌ వాల్‌లో భాగంగా నిర్మించిన సిమెంట్ గోడ కూలిపోయింది. దీంతో గోడ శిథిలాల కింద భక్తులు చిక్కుకుపోయారు. గోడతో పాటు మట్టిపెళ్లలు భక్తులపై పడటంతో స్పాట్‌లోనే భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల చేపట్టిన నాసిరకం నిర్మాణం భక్తుల ప్రాణాలు బలి తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సహాయ చర్యలు ప...