భారతదేశం, ఏప్రిల్ 23 -- సింహాచలం అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

సింహాద్రి అప్పన్నస్వామి నిజరూపదర్శనానికి టికెట్ల విక్రయాలు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమవుతాయని దేవస్థానం ఈవో కె.సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు.

సింహాచలం దేవస్థానం నిర్దేశించిన ప్రాంతాలతో పాటు ఆన్‌లైన్‌లో రేపటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు రూ.300, రూ.1000 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు ఈవో ప్రకటించారు. ఈ నెల 29 తర్వాత ఎలాంటి టికెట్ల విక్రయాలు జరగవని స్పష్టం చేశారు.

చందనోత్సవం రోజున కూడా టికెట్లు విక్రయం ఉండదని పేర్కొన్నారు. అలాగే భక్తుల కోసం ఉచిత దర్శనాల క్యూలైన్‌లు ఏర్పాటు చేసినట్లు ఈవో కె.సుబ్బారావు తెలిపారు.

Publishe...