భారతదేశం, జూన్ 12 -- అంబానీ కుటుంబ కోడలు రాధికా మర్చంట్ తాజాగా జామ్‌నగర్‌లో కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద (ITRA)ను సందర్శించిన సందర్భంగా రాధికా మర్చంట్, ఎలాంటి మేకప్ లేకుండా, చాలా సింపుల్‌గా, సొగసైన పేస్టల్ పసుపు రంగు డ్రెస్‌లో మెరిశారు. 'లెస్ ఈజ్ మోర్' అనే తమ ఫేవరెట్ స్టైల్‌ను ఆమె మరోసారి చాటుకున్నారు.

ముకేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీని వివాహం చేసుకున్న రాధికా మర్చంట్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద (ITRA)ను సందర్శించి ఆయుర్వేద వైద్య పద్ధతులు, రోగ నిర్ధారణ పద్ధతులు, ఔషధ మొక్కల వాడకం, ప్రయోగశాల పని గురించి లోతైన అవగాహన పొందారు. ఇన్‌స్టిట్యూట్‌లోని వివిధ విభాగాలను కూడా ఆమె సందర్శించారు.

ITRA సందర్శన కోసం రాధికా పేస్టల్ బటర్ ఎల్లో...