భారతదేశం, ఆగస్టు 15 -- 79వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఎర్రకోటపై వరుసగా 12వసారి జాతీయజెండా ఎగరవేశారు. అనంతరం జాతినుద్దేశించి మోదీ ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం అని, ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరే సమయం అని చెప్పారు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని గుర్తు చేశారు. ఎర్రకోట నుండి పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించారు. సింధు జలాల గురించి ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు మోదీ.

మన సైనికులు శత్రువులను వారి ఊహకు మించి శిక్షించారని ప్రధాని మోదీ అన్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో మతం పేరుతో దాడి చేసిన ఉగ్రవాదులకు సమాధానం చెప్పామన్నారు. దేశం మొత్తం కోపంతో నిండిపోయిందని, ఈ రకమైన మారణహోమంతో ప్రపంచం మొత్తం షాక్ అయ్యిందన్నారు. ఆపర...