భారతదేశం, ఏప్రిల్ 29 -- టాలీవుడ్ యంగ్ స్టార్ శ్రీవిష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమా రిలీజ్‍కు రెడీ అవుతోంది. మే 9వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. హర హర వీరమల్లు వాయిదా పడడం దాదాపు ఖాయమవడంతో ఆ తేదీకి సింగిల్ చిత్రం వచ్చేస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి కార్తీక్ రాజు సంగీతం అందించారు. సింగిల్ సినిమా ట్రైలర్ రీసెంట్‍గానే వచ్చింది. ఈ ట్రైలర్ పట్ల సినీ హీరో, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సీరియస్‍గా ఉన్నారని ఇండస్ట్రీలో టాక్.

సింగల్ చిత్రం ట్రైలర్ పట్ల మంచు విష్ణు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ ట్రైలర్లో శ్రీవిష్ణు.. 'శివయ్యా' అని గట్టిగా అరుస్తారు. కన్నప్ప సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్లో మంచు విష్ణు 'శివయ్యా' అని గట్టిగా అన్నారు. దానిపై కాస్త ట్రోలింగ్ కూడా నడిచింది. ఇప్పుడు సింగిల్ ట్రైలర్లో శివయ్యా అని వెటకరించేలా శ్రీవిష్...