భారతదేశం, జనవరి 13 -- న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ తన జీవితంలో మరో కీలక ఘట్టానికి చేరుకున్నారు. ఇప్పటివరకు క్విన్స్‌లోని అస్టోరియాలో ఉన్న ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ అపార్ట్‌మెంట్‌లో సాధారణ జీవితం గడిపిన ఆయన, ఇప్పుడు మేయర్ల అధికారిక నివాసమైన చారిత్రక 'గ్రేసీ మాన్షన్' (Gracie Mansion) లోకి తన భార్య, ప్రముఖ ఇలస్ట్రేటర్ రమా దువాజీతో కలిసి గృహప్రవేశం చేశారు. జనవరి 12న వారు తమ సామాన్లతో ఈ కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

"చాలామంది న్యూయార్క్ వాసులలాగే మేము కూడా నగరంలోని మరో ప్రాంతానికి మారుతూ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాం. గ్రేసీ మాన్షన్ నిజానికి ప్రజల ఇల్లు. అలాంటి చోట నివాసం ఉండే అవకాశం దక్కడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం" అని మమ్దానీ సోషల్ మీడియ...