Hyderabad, మే 10 -- టాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. తాజాగా సింగిల్ సినిమాతో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మే 9 థియేటర్లలో శ్రీ విష్ణు సింగిల్ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. కామెడీ రొమాంటిక్ సినిమాగా పేరు తెచ్చుకున్న సింగిల్ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

అలాగే, సింగిల్ మూవీకి ఫుల్ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. సినిమా అంతా ఆద్యం కామెడీతో అలరించిందని టాక్ వినిపిస్తోంది. దీంతో సింగిల్ మూవీకి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగుంటున్నాయి. ఇండియాలో సింగిల్ మూవీకి మొదటి రోజున రూ. 2 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది.

అలాగే, సింగిల్ మూవీ నిన్న రిలీజై బ్లాక్‌బస్టర్ రన్ కోసం ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సింగిల్ సినిమాక...