భారతదేశం, జూలై 22 -- దేశంలో ఎంజీ ఎం9 ఈవీని తాజాగా విడుదల చేసింది జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 69.90 లక్షలు! ఈ అత్యాధునిక, లగ్జరీ ఎలక్ట్రిక్ కారు డెలివరీలు ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది కియా కార్నివాల్, టయోటా వెల్​ఫైర్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చే లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీగా మార్కెట్లోకి వచ్చింది.

ఎంజీ సెలెక్ట్ నుంచి విడుదలైన మొదటి ఉత్పత్తి ఇది. దీన్ని ఎంజీ సైబర్‌స్టర్​తో పాటు ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ ద్వారా విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ రేంజ్​, ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఎంజీ ఎం9 ఈవీ సాధారణంగా ఎంపీవీలలో కనిపించే బాక్సీ డిజైన్‌తో వస్తుంది. ఇది కింది భాగంలో అమర్చిన హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద ఫ్రంట్, రేర్ ఓవర్‌హాంగ్‌లు, పెద్ద కనెక్టెడ్ టెయిల్‌లైట్లు వంటి ఎలిమెంట్స్​ని ...