భారతదేశం, జనవరి 6 -- భారత ఎలక్ట్రిక్​ వాహనాల విభాగంలో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్​కి షాక్​! 2025లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఈవీ ఈ కంపెనీకి చెందినది కాదు. జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్​కి చెందిన ఎంజీ విండ్సర్​ ఈవీ ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఈవీగా దూసుకెళుతోంది!

ఎలక్ట్రిక్ వాహనం అంటే కేవలం ప్రయోగం మాత్రమే కాదు, అదొక పక్కా ఫ్యామిలీ ఛాయిస్ అని 'ఎంజీ విండ్సర్' నిరూపించింది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం.. 2025 ఏడాదిలో మొత్తం 46,735 యూనిట్ల విండ్సర్ కార్లు అమ్ముడయ్యాయి. దీనితో దేశంలోనే ఒక ఏడాదిలో అత్యధిక సేల్స్ సాధించిన 4-వీలర్ ఎలక్ట్రిక్ వాహనంగా ఇది సరికొత్త చరిత్ర సృష్టించింది.

సాధారణంగా దేశ ఈవీ విభాగంలో అత్యధిక వాటా టాటా మోటార్స్​దే. అలాంటిది, ఈసారి టాటా కార్లను వెనక్కి నెట్టి, 2025లో బెస్ట్​ సెల్లి...