భారతదేశం, అక్టోబర్ 10 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా పేరొందిన ఎంజీ విండ్సర్​ ఈవీలో లిమిటెడ్​ ఎడిషన్​ మోడల్​ని సంస్థ తాజాగా లాంచ్​ చేసింది. దాని పేరు ఎంజీ విండ్సర్​ ఈవీ ఇన్​స్పైర్​. ఈ సరికొత్త ఈవీ ప్రారంభ ధర రూ. 16.65 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే, బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ (బీఏఏఎస్​) ఆప్షన్‌ను ఎంచుకునే వినియోగదారులు ఈ వాహనాన్ని కేవలం రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)కే సొంతం చేసుకోవచ్చు. ఇది లిమిటెడ్ ఎడిషన్ కావడంతో.. దేశవ్యాప్తంగా 300 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని గమనించాలి. విజువల్ అప్‌గ్రేడ్స్‌తో ఈ ప్రత్యేక ఎడిషన్ కారును తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎంజీ విండ్సర్ ఈవీ ఇన్‌స్పైర్ ఎడిషన్ పర్ల్ వైట్, స్టార్రీ బ్లాక్ రంగుల కలయికతో, డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్‌తో వస్తుంది. దీనికి ర...