భారతదేశం, మే 31 -- ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​ ఎలక్ట్రిక్​ బైక్​ డెలివరీలు ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ బైక్​పై మంచి బెనిఫిట్స్​ని ఇస్తోంది ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ. ఈ ఈ-బైక్​పై రూ. 10వేల విలువైన ఇనీషియల్​ బెనిఫిట్స్​ని సంస్థ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లు పరిమితం అని గుర్తుపెట్టుకోవాలి.! మొదటి 5,000 మంది రైడర్లకు మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ కింద బ్యాటరీకి ఫ్రీ ఎక్స్​టెండెడ్​ వారంటీ, మూవ్ఓఎస్+ కు ఉచిత సబ్​స్క్రిప్షన్, ద్విచక్ర వాహనంతో ఉచిత 'ఎసెన్షియల్ కేర్' సర్వీస్​ వంటి మూడు ప్రయోజనాలను ఓలా ఎలక్ట్రిక్​ అందిస్తోంది.

'ఎసెన్షియల్ కేర్' సేవలో 18 పాయింట్ల ఇన్​స్పెక్షన్​​ ఉంటుంది. దీనిలో భద్రత- పనితీరు కోసం సమగ్ర తనిఖీలు జరుగుతాయి. బ్రేకులు, టైర్లు, యాక్సిల్ సహా ఇతర వాటి కోసం సమగ్ర సర్వీసింగ్ కవరేజీతో పాటు నిజమైన ...