భారతదేశం, అక్టోబర్ 13 -- మచ్​ అవైటెడ్​ క్విడ్ ఈవీని అధికారికంగా ఆవిష్కరించింది ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థ రెనాల్ట్. క్విడ్​ ఇ-టెక్​ పేరుతో ఇది బ్రెజిల్​ మార్కెట్​లో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త మోడల్ డాసియా స్ప్రింగ్ ఈవీ అనే ఎలక్ట్రిక్​ కారుకు ఉపయోగించిన ప్లాట్‌ఫారమ్‌పైనే తయారైంది. రెనాల్ట్ సంస్థ విద్యుత్ వాహనాల వ్యూహంలో ఇది కీలక ముందడుగుగా చెప్పవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ క్విడ్ ఈవీకి సంబంధించిన టెస్ట్ వెహికిల్స్​ భారత రోడ్లపై ఇప్పటికే చాలాసార్లు కనిపించాయి. దీని బట్టి చూస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్‌లోకి కూడా త్వరలోనే ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది!

ఈ నేపథ్యంలో ఈ రెనాల్ట్​ క్విడ్​ ఈవీ రేంజ్​, ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

డిజైన్:

రెనాల్ట్ క్విడ్ ఈవీ డిజైన్ డాసియా ఎలక్ట్రిక్​ కారు మోడల్ నుంచ...