భారతదేశం, జూన్ 8 -- భారత దేశంలో ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్​ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు. మరీ ముఖ్యంగా 2 వీలర్​ ఎలక్ట్రిక్​ సెగ్మెంట్​కు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే మార్కెట్​లో చాలా ఆప్షన్స్​ లభిస్తున్నాయి. మరి మీరు కూడా ఒక ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? రేంజ్​ ఎక్కువ ఉంటే బెటర్​ అని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోమే! సింపుల్​ ఎనర్జీకి చెందిన సింపుల్​ వన్​ఎస్​ మీకు సెట్​ అవ్వొచ్చు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ రేంజ్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సింపుల్ వన్​ఎస్​ ఎలక్ట్రిక్ స్కూటర్​లో 8.5 కిలోవాట్ల (11.3 బీహెచ్​పీ) పిఎమ్ ఎస్ మోటార్ ఉంటుంది. 3.7 కిలోవాట్​ ఫిక్స్​డ్​ బ్యాటరీ ప్యాక్​ కూడా ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 181 కి.మీ (ఐడీసీ) రేంజ్​ని ఇస్తుంది.

ధర విభాగంలో వన్ఎస్ వేగవ...