భారతదేశం, ఆగస్టు 5 -- భారత్​ మార్కెట్​లో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్​ని క్యాష్​ చేసుకునేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగానే కొత్త కొత్త మోడల్స్​ని లాంచ్​ చేయడంతో పాటు పోర్ట్​ఫోలియోని అప్​డేట్​ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఒబెన్​ ఎలక్ట్రిక్​ కొత్త మోడల్​ని బయటకు తీసుకొచ్చింది. దీని పేరు ఒబెన్​ రోర్​ ఈజెడ్​ సిగ్మా. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈజెడ్​ బైక్​కి ఇది నెక్ట్స్​ జెన్​! ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, ధర, రేంజ్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఒబెన్​ రోర్​ ఈజెడ్​ సిగ్మా 3.4 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ వేరియంట్‌ను రూ. 1.27 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)తో సంస్థ పరిచయం చేసింది. ఇంకా శక్తివంతమైన 4.4 కేడబ్ల్యూహెచ్​ వేరియంట్ రూ. 1.37 లక్షలకు అందుబాటులో ఉంది. ఇవి ఇంట్రొడక్టరీ ప్రైజ్​లు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి.

రూ. 2,999 టోకెన్​...