భారతదేశం, అక్టోబర్ 27 -- టీవీఎస్ సంస్థ ఇటీవల టీవీఎస్ ఆర్​టీఎక్స్​ 300 మోడల్‌ను విడుదల చేసి అడ్వెంచర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు, ఐయాన్​ మొబిలిటీతో ఉన్న భాగస్వామ్యంలో భాగంగా, ఈసారి ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించాలని టీవీఎస్ యోచిస్తోంది. ఇందులో భాగంగానే గత ఆగస్టులో 'ఎం1 ఎస్​' ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్​ టీజర్‌ను విడుదల చేసింది. ఇక ఇప్పుడు నవంబర్​లో జరగనున్న ఈఐసీఎంఏ 2025 ఈవెంట్​లో ఈ ఈ-స్కూటర్​ని అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలోనే మరో టీజర్‌ను సైతం విడుదల చేసింది.

లేటెస్ట్​, పాత టీజర్ చిత్రాలను గమనిస్తే.. టీవీఎస్ ఎం1 ఎస్ ఎలక్ట్రిక్​ స్కూటర్ షార్ప్‌గా, ఏరోడైనమిక్​గా ఉన్న ముందు భాగాన్ని కలిగి ఉందని స్పష్టమవుతోంది. ఇందులో 'కనుబొమ్మల' ఆకారంలో ఉన్న డీఆర్​ఎల్​ (డేటైమ్ రన్నింగ్ లైట్లు), అంతర్న...