భారతదేశం, జూన్ 20 -- సక్సెస్​ఫుల్​ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్ నుంచి మరింత సరసమైన మోడల్‌గా బజాజ్ చేతక్ 3001 ఇటీవల మార్కెట్‌లోకి ప్రవేశించింది. దీని ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్ రూ. 99,990గా ఉంది. ఇది చేతక్ సిరీస్‌లో కొత్త ఎంట్రీ-పాయింట్ మోడల్‌గా మారింది. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే పట్టణ వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం దీనికి ఉంది.

ఈ లాంచ్‌తో, బజాజ్ అత్యంత పోటీతత్వ విభాగంలో టీవీఎస్, ఏథర్, విడా, హోండా వంటి ప్రసిద్ధ కంపెనీలతో పాటు త్వరలో విడుదల కానున్న సుజుకీ ఎలక్ట్రిక్ ఈ యాక్సెస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోటీదారులతో పోల్చితే బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఛార్జింగ్ సమయం, ఫీచర్లు, ధర పరంగా చేతక్ 3001 ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాము..

బజాజ్ చేతక్ 3001 ఈ-స్కూటర్​ 3కేడబ్ల్...