భారతదేశం, జూన్ 1 -- కొత్తగా ఒక అఫార్డిబుల్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఎంఎక్స్ మోటోకు సంబంధించిన ఒక అఫార్డిబుల్​ ఈ-స్కూటర్​ అందుబాటులో ఉంది. దాని పేరు ఎంఎక్స్​వీ ఈకో. ఇది తయారీదారు లైనప్​లో ఎంఎక్స్ 9 ఎలక్ట్రిక్ బైక్​తో కలిసి ఉంటుంది. ఇక ఈ ఎంఎక్స్ మోటో ఎంఎక్స్​వీ ఈకో.. రెండు వెర్షన్లలో లభిస్తుంది. వేరియంట్ల మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం బ్యాటరీ ప్యాక్- రైడింగ్ రేంజ్. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ధర, రేంజ్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఎంఎక్స్​వీ ఈకో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎంఎక్స్​ మోటో లైఫ్​పీఓ4 బ్యాటరీ ప్యాక్లను ఉపయోగిస్తోంది. ఇవి రిమూవెబుల్​, ఓవర్​ ఛార్జింగ్​ని నిరోధించే సర్క్యూట్రీతో వస్తాయి. ఎలక్ట్రిక్ మోటారు 3000 వాట్ల బీఎల్​డీసీ హబ్ యూనిట్​ని అందిస్తుంది. ఇది 580 ఆ...