భారతదేశం, ఫిబ్రవరి 17 -- భారతీయ ఆటోమొబైల్​ ఇండస్ట్రీలోని ఎలక్ట్రిక్​ 2 వీలర్​ సెగ్మెంట్​పై ఇటీవలి కాలంలో కస్టమర్స్​ ఫోకస్​ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే మార్కెట్​లో చాలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఆప్షన్స్​ అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో ఒకటి ఎంచుకోవడం ఇప్పుడు కాస్త కష్టంగా మరిందనే చెప్పుకోవాలి. మరి మీరు కూడా ఒక మంచి ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే మీరు ఏథర్​ 450 ఎస్​ గురించి తెలుసుకోవాల్సిందే! మిడిల్​క్లాస్​ పాకెట్స్​కి ఉపయోగపడే విధంగా మంచి రేంజ్​తో పాటు వివిధ ఫీచర్స్​ కలిగి ఉన్న ఈ ఏథర్​ 450ఎస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ ఏథర్​ 450 ఎస్​ ఈ-స్కూటర్​లో సింగిల్​ సీట్​, క్యారీ హుక్​, ప్యాసింజర్​ ఫుట్​రెస్ట్​, 22 లీటర్​ అండర్​సీట్​ స్టోరేజ్​, డిస్టెన్స్​ ఎంప్టీ ఇండికేటర్​ వంటివి ఉన్నాయి.

ఇక సేఫ్టీ...