భారతదేశం, జూన్ 27 -- హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన ఎలక్ట్రిక్ స్కూటర్ 'యాక్టివా ఈ' కోసం కొత్త, మరింత సరసమైన బ్యాటరీ రెంట్​ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కొత్త 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) లైట్' ప్లాన్ నెలకు రూ. 678 (+జీఎస్టీ)కి అందుబాటులో ఉంటుంది. అయితే, ఇది నెలకు 20 కేడబ్ల్యూహెచ్​ వినియోగానికి పరిమితం! గతంలో ప్రకటించిన BaaS ప్లాన్‌లతో పోలిస్తే, ఈ కొత్త ప్లాన్ గణనీయంగా తక్కువ ధరకు లభిస్తుంది.

గతంలో BaaS ప్లాన్‌లను బేసిక్ ప్లాన్ కోసం రూ. 1,999 (నెలకు 35 kWh వరకు), అడ్వాన్స్ ప్లాన్ కోసం రూ. 3,599 (నెలకు 82 kWh వరకు) గా ప్రకటించింది. ఈ BaaS ప్లాన్‌లు ప్రత్యేకంగా స్వాపబుల్ బ్యాటరీలతో వచ్చే యాక్టివా ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్‌కు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లను జపాన్‌లోని హోండా మోటార్ కంపెనీ అభివృద్ధి చేసింది. ...