భారతదేశం, జూన్ 11 -- ప్రముఖ సింగ్ మంగ్లీ బర్త్ డే పార్టీపై పోలీసులు సోదాలు చేశారు. చేవెళ్ల శివారులోని ఓ రిసార్టులో స్నేహితులకు మంగ్లీ బర్త్ డే పార్టీ ఇచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... రిస్టారుపై దాడులు చేశారు. ఈ తనిఖీల్లో విదేశీ మద్యంతో పాటు గంజాయి దొరికాయి. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

చేవెళ్ల ఇన్‌స్పెక్టర్ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..." ఒక విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సోదాలు జరిగాయి. ఈ ఆపరేషన్ సమయంలో... దామోదర్ అనే వ్యక్తి వేదిక వద్ద గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడు. ఈ కార్యక్రమంలో ఎంతవరకు మాదకద్రవ్యాల వినియోగం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు"అని చెప్పారు.

"పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. ఎక్సైజ్ అనుమతి లేకుండా పార్టీలో మద్యం సేవిం...