Hyderabad, ఆగస్టు 18 -- బాలీవుడ్‌ స్టార్ సింగర్స్‌లలో కనికా కపూర్ ఒకరు. బేబీ డాల్, చిట్టియాన్ కా లైయాన్ వే వంటి పాటలతో ఫుల్ ఫేమస్ అయింది సింగర్ కనికా కపూర్. అయితే, సింగర్స్‌కు సంబంధించిన రియాలిటీ గురించి ఇటీవల ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది ఈ బ్యూటిఫుల్ సింగర్.

బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ హోస్ట్‌గా చేస్తున్న బంక్ విత్ ఉర్ఫీ షోలో గాయనీగాయకులకు ఇచ్చే పారితోషికం గురించి చెప్పింది కనికా కపూర్. గాయకులకు భారతదేశంలో నిజంగా సరైన పారితోషికం లభించదని, వారు వాస్తవంగా డబ్బు ఎలా సంపాదిస్తారో వివరించింది.

"సింగర్స్‌కు సరైన పారితోషికం అందదు. నేను కుదుర్చుకున్న అన్ని కాంట్రాక్ట్స్ మీకు చూపిస్తాను. నాకు కేవలం రూ.101 మాత్రమే చెల్లించారు. రెమ్యునరేషన్‌కు బదులుగా వారు మాకు మేలు చేస్తున్నట్లు చెప్తారు. నేను పేరు చెప్పలేను కానీ, ఇండియాలో ఒక గొప్ప గాయకుడు కూ...