భారతదేశం, జనవరి 22 -- సింగరేణి బొగ్గు గనుల టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ టెండర్లను రద్దు చేయడంపై పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీని నియమించింది. ఈ మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

"నైనీ కోల్ బ్లాక్ విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ అధికారుల బృందం(ఇద్దరు) సింగరేణిలో పర్యటించనుంది. వివాదానికి, టెండర్ రద్దు చేయడానికి గల కారణాలను.. ఇతర అంశాలపైనా ఈ బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారించనుంది. ఈ బృందంలో కేంద్ర బొగ్గు శాఖ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, డైరెక్టర్ టెక్నికల్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు" అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్...