భారతదేశం, జనవరి 21 -- సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం ఉన్నా.. అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏ రకమైన జోక్యం, అధికారమూ కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ముగ్గురు కేంద్రం నుంచి 7 గురు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోర్డు డైరెక్టర్లుగా ఉంటారని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో.. రాష్ట్రంలో పదేళ్లపాటు కల్వకుంట్ల ఫ్యామిలీ మాటే సింగరేణిలో చెల్లుబాటైందని వ్యాఖ్యానించారు.

టెండర్ల దగ్గర్నుంచి.. చిన్న చిన్న కాంట్రాక్టుల వరకు ప్రతిచోటా కేసీఆర్ కుటుంబం ఆడింది ఆట అన్నట్లు సాగిందని ఆరోపించారు కిషన్ రెడ్డి. సింగరేణి కార్యక్రమాల్లో రాజకీయ జోక్యంతో సమస్యల్లోకి నెట్టేశారని తెలిపారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.32వేల కోట్ల బకాయిలు పెట్టారన్నారు. ...