భారతదేశం, నవంబర్ 9 -- సింగరేణిలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కాలరీస్ నుంచి ఈ నోటిఫికేషన్ ఉంది. అయితే ఇంటర్నల్ అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టుగా సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు ప‌లు ఎగ్జిక్యూటివ్ క్యాడ‌ర్ పోస్టుల‌ను ఇంట‌ర్నల్ అభ్యర్థుల‌తో భ‌ర్తీకి స‌ర్క్యుల‌ర్ విడుద‌ల‌ అయింది.

ఈ2 గ్రేడ్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ&ఎం) పోస్టులు 23 ఉన్నాయి. వీరికి బేసిక్ శాలరీ నెలకు రూ.50000గా నిర్ణయించారు. అసిస్టెంట్ ఇంజినీర్ సివిల్ 4 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ1 గ్రేడ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈ&ఏం) పోస్టులు 33, సివిల్ 6, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 16 పోస్టులు భర్తీ చేస్తారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.

పైన...