భారతదేశం, జూలై 1 -- అమరావతి: సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి తో పాటు మిగిలిన వారిపై కూడా తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ (FIR)ను రద్దు చేయాలని (క్వాష్) కోరుతూ వై.ఎస్. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం

ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ (ఏజీ), కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం కావాలని కోరారు. అయితే, వై.ఎస్. జగన్ తరపు న్యాయవాది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, "ఆధారాలున్నా ఇంకా సమయం దేనికి?" అని ప్రశ్నించారు. ఏజీ కౌంటర్ దాఖలు చేయాలని అడగడంతో, హైకోర్టు "ఎఫ్‌ఐఆర్ సమాచారం సరిపోతుంది కదా?" అని ఏజీని ప్రశ్నించింది.

వై.ఎస్. జగన్ తరపు న్యాయవాది వాదనలు వి...