Andhrapradesh,panladu, జూన్ 22 -- ఇటీవలే వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లాలోని రెంటపాళ్లలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమాదానికి గురై.. సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఓ ప్రైవేటు వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి. వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ కింద పడే సింగయ్య మృతి చెందినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగినట్లు అయింది.

వైఎస్ జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "వైఎస్ జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది ఈ ఘటన. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి ? 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ గారు చేత...