Andhrapradesh, జూలై 27 -- ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్ లక్ష్యంలో భాగంగా పర్యటన కొనసాగనుంది.

ఇవాళ ఉదయం 6:25కి సింగపూర్ చాంఘీ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు.. పలువురు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీ ఎన్నార్టీ ప్రతినిధులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా సింగపూర్ లో పర్యటించనున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 2:00 గంటలకు ఓవిస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ సమావేశానికి సింగపూర్‌తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ తదితర దేశాల నుంచి తెలుగు పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెన...