భారతదేశం, నవంబర్ 3 -- ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుని భారత మహిళల క్రికెట్ జట్టు ఆదివారం చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రక విజయాన్ని సెలబ్రిటీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చిరంజీవి నుంచి ప్రియాంక చోప్రా వరకు సోషల్ మీడియాలో టీమ్ పై ప్రశంసలు కురిపించారు.

మహిళల వన్డే ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలవడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ''ఇండియన్ క్రికెట్ ఎంతో గర్వపడే, చారిత్రక రోజు. మహిళల వరల్డ్ కప్ లో సెన్సేషనల్ విక్టరీ సాధించిన మన భారత అమ్మాయిల క్రికెట్ టీమ్ కు అభినందనలు. కల కనాలనే ధైర్యం ఉన్న ప్రతి అమ్మాయి, నమ్మే ప్రతి పేరేంట్, కేరింతలు కొట్టే ప్రతి అభిమాని విజయం ఇది. ఇలాగే మెరుస్తూ హద్దులు బద్దలు కొడుతూనే ఉండాలి'' అని చిరు ట్వీట్ చేశారు.

నటి ప్రియాంక చోప్రా ఇన్...