Hyderabad, జూన్ 25 -- ప్రతిరోజు మన ఇంట్లో దీపారాధన చేయడం వలన ఎంతో మంచి ఫలితాన్ని పొందవచ్చు. అందుకే ప్రతి రోజు ఇంటిని శుభ్రం చేసి, దేవుడి గదిని శుభ్రపరచి, దీపారాధన చేసి, పుష్పాలతో పూజ చేసి, ఆ తర్వాత ధూపం, నైవేద్యం - ఇలా ఎవరికి నచ్చినట్లు వారు రోజూ పూజ చేస్తారు. అయితే, చాలామంది సాలిగ్రామాలను కూడా పూజిస్తారు. ఇంట్లో సాలిగ్రామాలను పెట్టి పూజించడం వలన ఏమవుతుంది? సాలిగ్రామాలను ఆరాధించడం వలన ఎలాంటి ఫలితాన్ని పొందవచ్చు అనే ముఖ్యమైన విషయాలను ఈ రోజు తెలుసుకుందాం.

నేపాల్‌లో పవిత్ర గండకీ నదిలో ఈ నలుపు, మృదువైన రాళ్లు కనిపిస్తాయి. శంఖం, చక్రం, గద, పద్మం లాంటి శుభ చిహ్నాలు వీటి పై ఉంటాయి. కొన్ని రాళ్లకైతే తెల్లటి వృత్తాకార చారలు ఉంటాయి. దీంతో అవి మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి.

సాలిగ్రామం విష్ణువు చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే వీటిని భక్తితో ఆరాధిస్తా...