భారతదేశం, ఏప్రిల్ 25 -- కోర్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టించిన మూవీ సారంగ‌పాణి జాత‌కం. క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు మోహ‌నకృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రూపా కొడ‌వాయూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో వెన్నెల‌కిషోర్‌, వైవా హ‌ర్ష కీల‌క పాత్ర‌లు పోషించారు.ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సారంగ‌పాణి జాత‌కం ఎలా ఉందంటే?

సారంగ‌పాణి(ప్రియ‌ద‌ర్శి) ఓ కార్ షోరూమ్‌లో సేల్స్‌మెన్‌గా ప‌నిచేస్తుంటాడు. జాత‌కాల పిచ్చి ఎక్కువ‌. చేతి గీత‌లే త‌న త‌ల‌రాత‌ను నిర్దేశిస్తాయ‌ని న‌మ్ముతుంటాడు. త‌న షోరూమ్‌లోనే మేనేజ‌ర్‌గా ప‌నిచేసే మైథ‌లిని (రూప కొడ‌వాయూర్‌) ఇష్ట‌ప‌డ‌తాడు. మైథిలి కూడా సారంగ‌పాణిని ప్రేమిస్తుంది. పెద్ద‌ల‌ను ఒప్పించి మైథిలితో ఏడ‌డుగులు వేయాల‌ని సారంగ‌పాణి అనుకుంటాడు. ఎంగేజ్‌మెంట్ జ‌రుగుతుంది.

స...