భారతదేశం, జనవరి 16 -- సౌత్ ప్రేక్షకులను తన సహజమైన నటన, డ్యాన్స్‌తో మాయ చేసిన 'నేచురల్ బ్యూటీ' సాయి పల్లవి.. ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. మిస్టర్ పర్ఫెక్ట్‌నిస్ట్ ఆమిర్ ఖాన్ నిర్మాణంలో, అతని కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా 'ఏక్ దిన్' (Ek Din). ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ఆసక్తి రేకెత్తించగా, తాజాగా శుక్రవారం (జనవరి 16) మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

జునైద్ ఖాన్, సాయి పల్లవి మధ్య నడిచే స్వచ్ఛమైన, మృదువైన ప్రేమకథను ఈ ఏక్ దిన్ మూవీ టీజర్‌లో చూపించారు. జునైద్ చెప్పే వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలవుతుంది. "మీరా.. నీ నవ్వు నాకు చాలా ఇష్టం. నేను నీ మనసు గెలుస్తానో లేదో తెలియదు.. కానీ, అందనంత దూరంలో ఉంటే అవి కలలు ఎలా అవుతాయి?" అని జునైద్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

మరో సీన్ లో సాయి పల్లవి మాట్లాడుతూ.. "...