భారతదేశం, జనవరి 15 -- బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన కుమారుడు, యువ నటుడు జునైద్ ఖాన్ కెరీర్‌పై ప్రత్యేక దృష్టి సారించాడు. జునైద్ హీరోగా, సౌత్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్‌గా ఒక స్వచ్ఛమైన లవ్ స్టోరీని ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు 'ఏక్ దిన్' (ఒక రోజు) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. గురువారం (జనవరి 15) నాడు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ విడుదల చేసింది.

ఏక్ దిన్ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులకు ఒక ఫీల్ గుడ్ వైబ్‌ని ఇస్తోంది. చుట్టూ మంచు కురుస్తుండగా.. జునైద్, సాయి పల్లవి చేతిలో ఐస్‌క్రీమ్ పట్టుకొని నవ్వుతూ నడుచుకుంటూ వెళ్తున్న సీన్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. "ఒకే ప్రేమ.. ఒకే అవకాశం" అనే క్యాప్షన్ సినిమాలోని గాఢతను తెలియజేస్తోంది. "జీవితపు గందరగోళంలో.. ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వస్తు...