Hyderabad, జూలై 21 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను తాజాగా ఇవాళ (జూలై 21) నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పవన్ కల్యాణ్ వెల్లడించారు.

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "మీడియా మిత్రులతో రాజకీయాల పరంగా చర్చించాను. కానీ, ఇలా ఒక సినిమా కోసం పెద్దగా మాట్లాడలేదు. సినిమాకి సంబంధించి మాట్లాడటానికి నేను మొహమాట పడతాను. సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు" అని అన్నారు.

"పని చేయడం తెలుసు తప్ప.. ఇంత చేశాను, అంత చేశాను అని చెప్పుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను అనుకోకుండా నటుడిని, సాంకేతిక నిపుణుడిని అయ్యాను. సినిమా గురించి మీడియాతో మాట్లాడక పోవడానికి నాకు పొగరో, అహంకారమో కారణం కాదు. సినిమా గురించి చెప్పుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది" అని ప...