భారతదేశం, సెప్టెంబర్ 17 -- విశాఖపట్నం మధురవాడలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు. జీఎస్టీపై కీలక నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడికి వర్తించే ఏకైక పన్ను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అని కేంద్రమంత్రి అన్నారు. సంక్లిష్టంగా ఉన్న జీఎస్టీ వ్యవస్థను మరింత సరళీకృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 పేరుతో కొత్త సంస్కరణలను తీసుకువచ్చిందని ఆమె అన్నారు. ఇది సామాన్యులకు వరం అని పేర్కొన్నారు.

రోజువారీ అవసరాలపై ప్రతి పన్ను మీద సమీక్షించామని, కొత్త జీఎస్టీ 2.0 లో రేట్లు గణనీయంగా తగ్గుతాయని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుత నాలుగు స్లాబ్‌లకు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతానికి బదులుగా ఇ...