భారతదేశం, నవంబర్ 25 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమోటా ధరలు బాగా పెరిగాయి. చిత్తూరు బెల్ట్‌లోని హోల్‌సేల్ మార్కెట్లు, రిటైల్ మార్కెట్లలో కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద టమోటా వాణిజ్య కేంద్రాలలో ఒకటైన మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో, మొదటి గ్రేడ్ టమోటాలు 10 కిలోలకు రూ.610 కు చేరుకోగా రెండో గ్రేడ్ టమోటాలు రూ.480కు అమ్ముడవుతున్నాయి. వారం క్రితం అదే రకాలు రూ.440, రూ.340కు అమ్ముడయ్యాయి.

మార్కెట్ రాకపోకలు కూడా 140 మెట్రిక్ టన్నులకు బాగా పడిపోయాయి. ఇది సాధారణ రాకపోకల కంటే చాలా తక్కువ అని అంటున్నారు. మెుంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో టమాటా పంట నష్టం జరిగింది. తుఫాను మెుంథాకు ముందు రూ.20 నుండి రూ.40 వరకు ఉన్న రిటైల్ ధరలు ఇప్పుడు కిలోకు రూ.65 నుండి రూ.80 వరకు పెరిగాయి.

తక్కువ సరఫరా ఉన్న ప్రాంతాల్లో ధరలు కిలోకు రూ.90 కూడా దాటాయి. తుపానుతో...