భారతదేశం, డిసెంబర్ 13 -- సామాజిక అంశాలతో తెరకెక్కిన సెటైరికల్ రూరల్ కామెడీ ఎమోషనల్ సినిమా దండోరా. తాజాగా ఈ సినిమా నుంచి దండోరా టైటిల్ సాంగ్‌ను ఇవాళ శనివారం (డిసెంబర్ 13) విడుదల చేశారు. దండోరా పాటలోని పల్లవి ఎంతో ఆకట్టుకునేలా ఉంది.

నిను మోసినా న‌ను మోసినా

అమ్మ పేగు ఒక‌టేన‌న్నా

నిను కోసినా న‌ను కోసినా

రాలే ర‌గ‌తం ఎరుపేన‌న్నా

చిన్నా పెద్దా తేడా ఎట్లొచ్చేరా

నన్ను తొక్కే హ‌క్కు ఎవ‌డిచ్చేరా

ముట్టుకుంటే మైల ఎట్ట‌య్యెరా

కొట్టి కొట్టి గుండె డ‌ప్ప‌య్యెరా

దండోరా.. దండోరా...

అంటూ సాగే 'దండోరా..' మూవీ టైటిల్ సాంగ్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మార్క్ కె రాబిన్ సంగీత సార‌థ్యం వహించిన ఈ పాట‌ను కాస‌ర్ల శ్యామ్ రాశారు. ఆంథోని దాస‌న్‌, మార్క్ కె.రాబిన్ పాట‌ను పాడారు.

స‌మాజంలో అట్ట‌డుగు వ‌ర్గాల ప్ర‌జ‌ల బాధ‌ల‌ను తెలియ‌జేసేలా సాగే ఈ పాట చ...