Telangana,hyderabad, ఆగస్టు 27 -- సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. జీవో 112ను అమలును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సాదా బైనామాల దరఖాస్తులకు మోక్షం కలగనుంది.

రాష్ట్రంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం 2020లో నాటి బీఆర్ఎస్ సర్కార్. జీవో 112ను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు కాగా. మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పట్నుంచి ఈ ప్రక్రియపై విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేస్తూ మంగళవారం హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....