భారతదేశం, జనవరి 14 -- మెగాస్టార్ చిరంజీవి, లేడి సూపర్ స్టార్ నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ కామెడీ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఇప్పటి వరకు ఫ్లాప్ చూడని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేష్ అతిథి పాత్రలో మెరిశాడు.

సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మూవీ బాగా కనెక్ట్ అయింది. ఫలితంగా తొలి రోజే వరల్డ్ వైడ్‌గా రూ. 84 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మేకర్స్ తెలిపారు.

ఈ నేపథ్యంలో తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్‌లో సినిమాలో ఇళయరాజా సుందరి సాంగ్ వాడినందుకు ఆయన కేసు వేశారా అని జర్నలిస్ట్ ఓ ప్రశ్న వేశారు. దానికి అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

"ఇళయరాజా గారు. ఈ ...