భారతదేశం, జూలై 17 -- హా హా హాసిని అంటూ తెలుగు ఆడియన్స్ కు ఎంతో దగ్గరైంది జెనీలియా. తెలుగులో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసింది. పక్కింటి అమ్మాయిలా అనిపించే జెనీలియా ఒకప్పుడు వరుసగా తెలుగు సినిమాలతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసింది. కానీ పెళ్లి తర్వాత ఇక్కడి సినిమాలకు దూరమైంది. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను 'జూనియర్' సినిమాతో పలకరించనుంది.

జెనీలియా 13 ఏళ్ల తర్వాత ఓ తెలుగు సినిమా చేసింది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటీ హీరోగా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించిన సినిమా 'జూనియర్'. ఈ మూవీ శుక్రవారం (జూలై 18) రిలీజ్ కానుంది. జెనీలియా చివరగా 2012లో రానా దగ్గుబాటితో కలిసి నా ఇష్టం సినిమా చేసింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు ఆడియన్స్ ను కలవడం ఇదే తొలిసారి. గురువారం రాత్రి హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జూనియర్ ప్రీ రిలీజ్ ఈవ...