Andhrapradesh, సెప్టెంబర్ 5 -- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినియోగిస్తున్న హెలీకాప్టర్‌ను మార్చారు. తరుచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండడంతో గతంలో వినియోగించిన చాపర్ స్థానంలో మరో హెలీకాప్టర్ అద్దెకు తీసుకున్నారు. బెల్ కంపెనీకి చెందిన హెలీకాప్టర్‌ను సీఎం సహా వీవీఐపీల కోసం అద్దె ప్రాతిపదికన ఇన్నాళ్లూ ప్రభుత్వం వినియోగించిన సంగతి తెలిసిందే.

ఇటీవల కాలంలో ఈ చాపర్‌కు టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఓసారి.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటనలో మరోసారి హెలికాప్టరులో సాంకేతిక సమస్యలు వచ్చాయి. అప్పట్లోనే ఈ హెలికాప్టర్ స్థానంలో వేరే హెలికాప్టర్ వినియోగించాలనే.. లేకుంటే భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయనే చర్చ జరిగింది.

ఇక ఇటీవల కాలంలో మరికొన్ని సందర్భాల్లో ఇదే తరహా సాంకేతిక సమస్య తలెత్తడంతో పాటు, టేకాఫ్‌కు ఎక్కువ సమయం తీసుకోవడం వ...