భారతదేశం, జూలై 14 -- ఖమ్మం జిల్లా విక్రమ్‌నగర్ నివాసి మదన్ మొదటి భార్యకు దూరంగా ఉంటూ టేకులపల్లి నివాసి హస్లితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఖమ్మం పట్టణంలో సహజీవనం సాగిస్తున్నాడు. హస్లికి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే రెండేళ్ల క్రితం కొణిజర్ల మండలానికి చెందిన ఇంకో మహిళను పెండ్లి చేసుకున్నాడు. హస్తికి పిల్లలు పుట్టరన్న కారణంతో ఈ వివాహం చేసుకున్నానని చెబుతూ ఒకే ఇంట్లో హస్తితో రెండో భార్యతో కలిసి ఉంటున్నాడు. భార్యకు, హస్లికి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో హస్లిని చంపేయాలని కుట్ర పన్నాడు.

ఈ కుట్రలో భాగంగా హస్లికి మాయమాటలు చెప్పాడు. రెండో భార్యను చేతబడి చేసి అడ్డుతొలగించుకుందామని నమ్మబలికి సూర్యాపేట సమీపంలోని కిష్టాపురం అడవుల్లోకి తీసుకెళ్లాడు. చల్లా నాగేశ్వర రావు, తమ్మిశెట్టి నరసింహారావు అనే నిందితుల సహకారంతో హస్లి...